అల్లూరిజిల్లా ముంచింగి పుట్టు త్రినేత్రం న్యూస్ ఆగస్టు 16: మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు జాతీయ కాంగ్రెస్ ఆదివాసి రాష్ట్ర వైస్ చైర్మన్ వెంగడ నీలకంఠం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శతాబ్దాల బానిసత్వం నుంచి స్వేచ్ఛను తెచ్చిన త్యాగధనులకు జోహార్లు అర్పిస్తూ, స్వాతంత్ర్యం ఒక పండుగ కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. గిరిజన విప్లవకారులు మర్రి కామయ్య, బిర్సా ముండా, కొమరం భీమ్ పాత్రను స్మరించారు.
పల్లెల అభివృద్ధే దేశ అభివృద్ధి అని, కానీ నేడు పల్లెలు పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా మంచి నాయకులను ఎన్నుకోవాలని, కులమత భేదాలు లేకుండా ఐక్యంగా ఉండాలని, కులమత రహిత సమాజం నిర్మాణం ద్వారా నిజమైన స్వాతంత్ర ఫలాలు అందుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సీతమ్మ, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఎంపీడీఓ సూర్యనారాయణమూర్తి, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంగడ జగన్, గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు మొశియా తిరుపతిరావు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


