WhatsApp Image 2024 03 26 at 11.07.37
Trinethram News : వరంగల్ జిల్లా:మార్చి 26
ఫిబ్రవరి 28నుండి నిర్వ హించిన ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో దానికి సంబంధించిన ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్‌ను బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది.
వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ఫోన్లను అనుమతించకూ డదని ఆదేశించింది. గతం లో సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
రాష్ట్రంలో 16 కేంద్రాల్లో 20 వేల మంది అధ్యాపకులు వాల్యూయేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. నాణ్యమై న మూల్యాంకనం కోసం ఒక్కొక్కరికి రోజుకు 30 పేపర్లు మాత్రమే ఇస్తున్నారు.
