అల్లూరిజిల్లా,మార్చి 3, (త్రినేత్రం న్యూస్) : గిరిజన యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పాడేరు (ఐటిడిఏ) ఆధ్వర్యంలో 45 రోజులపాటు ఉచిత డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీపూజ తెలిపారు.
జిల్లాలోని 11 మండలాలకు చెందిన గిరిజన యువతీ యువకుల కోసం మొత్తం 120 మందికి ఈ శిక్షణ ఇవ్వనున్నారు. మార్చి 6వ తేదీ నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అరకువేలి డిగ్రీ కాలేజ్ హాస్టల్‌లో నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనే వారికి ఉచిత భోజన వసతి సౌకర్యంతో పాటు అనుభవజ్ఞులైన ట్రైనర్ల ద్వారా ప్రాక్టికల్ మరియు సిద్దాంతపరమైన శిక్షణ అందించనున్నారు.
ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీ పూజ మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో యువతకు స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. డ్రైవింగ్ నైపుణ్యం సాధించడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభించే అవకాశముందని పేర్కొన్నారు.
పదవ తరగతి ఉత్తీర్ణులైన ఆసక్తి గల యువతీ యువకులు 8019867264, 7287075464 ఫోన్ నంబర్లకు సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అలాగే సంబంధిత అభ్యర్థులు తమ దరఖాస్తులను ఐటిడిఏ కార్యాలయానికి నేరుగా సమర్పించవచ్చని వెల్లడించారు.
గిరిజన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును బలోపేతం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


