అనంతగిరి, మార్చి 3, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయతీ పరిధిలో రైతు భరోసా కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అరకు వేలి వైపు వెళ్లే ప్రధాన రహదారిపై చిలుకలగడ్డ నుండి అనంతగిరి వైపు ఇసుక లోడుతో వెళుతున్న లారీని కారు ఢీకొట్టింది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన యాత్రికులు అరకు,బొర్ర గుహల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో రెండు వాహనాల ముందుభాగాలు పూర్తిగా నుజ్జునుజ్జులయ్యాయి.
కారులో డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. అయితే అదృష్టవశాత్తు వారికి ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


