SI Balakrishna : మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

TRINETHRAM NEWS

డిండి ఎస్సై బాలకృష్ణ,
డిండి (గుండ్లపల్లి) ,సెప్టెంబర్ 17 ,త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని దొంతినేని నరసింహారావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్స్ కార్యక్రమం పై ,స్థానిక ఎస్సై బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తుపదార్థాల వినియోగం వల్ల ఊపిరితిత్తులు చెడిపోయి, అనారోగ్యానికి గురవుతారని, సమాజంలో గౌరవం కోల్పోతారని అన్నారు. క్రమశిక్షణతో చదువుకొని, విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులకు ఎంపిక కావాలని ఆయన సూచించారు. ఏమైనా తప్పుడు పనులు చేసి శిక్షకు గురైనట్లయితే, భవిష్యత్తు అంధకారం అవుతుందని, ఉద్యోగాలకు ఎంపిక కావడం కుదరదని ,నేరస్తులుగా ముద్ర పడుతుందని, ఎస్సై విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ పాండురంగయ్య, అధ్యాపకులు కృష్ణయ్య, సంతోష్ కుమార్, ఆంజనేయులు, హనుమంతు, శ్రీరాములు, లింగస్వామి, జ్యోతి శ్రీ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Stay away from intoxicants

You cannot copy content of this page

Scroll to Top