ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ .
దేవరకొండ (పి.ఎ పల్లి) సెప్టెంబర్ 18 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గంలోని పీఏ పల్లిలో నూతనంగా ఏర్పాటు చేయబడిన లయన్స్ క్లబ్ పీఏ పల్లి శాఖ ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలునాయక్ ప్రసంగిస్తూ, లయన్స్ క్లబ్ సేవలు సమాజంలో విశిష్టమైనవి అని గుర్తు చేశారు. గ్రామీణ స్థాయిలో పేద, బలహీన వర్గాల అభ్యున్నతికి లయన్స్ క్లబ్ మరింతగా సేవలు విస్తరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
సామాజిక సేవలో లయన్స్ క్లబ్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని, విద్య, ఆరోగ్యం, శానిటేషన్, పేద ప్రజల అవసరాల తీర్చడంలో ఈ సంస్థ చేసే సేవలు ఎంతో గొప్పవని కీర్తించారు. పీఏ పల్లిలో లయన్స్ క్లబ్ ప్రారంభం కావడం అభినందనీయమైన విషయని. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా లయన్స్ క్లబ్ సేవలు కొనసాగాలని పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించి అభినందించారు. అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయులు, ఉత్తమ రైతులు, ఉత్తమ పారిశుధ్య కార్మికులను శాలువాతో ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


