డిండి (గుండ్ల పల్లి) జులై21 త్రినేత్రం న్యూస్. డిండి మండల నూతన ఎస్ ఐ గా సిహెచ్ బాలకృష్ణ నేడు (సోమవారము) రోజున బాధ్యతలు స్వీకరించారు. గతంలో డిండి మండలము స్టేషన్ ఆఫీసర్ విధులు నిర్వహించిన బోదాసు రాజు బదిలీపై యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్ ఐ బాలకృష్ణ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రల పరిరక్షణకు కృషి చేస్తానని, మండ లంలో అసాంఘీక కార్యక్రమాలు, అక్రమ మద్యం, గుడుంబా, గంజాయి రవాణా అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు. ముఖ్యంగా స్థానిక రాజకీయ నాయకులు,వ్యాపారస్తులు తమకు సహకరించి, ప్రమాదాలను అరికట్టే విధంగా ముందుకు వెళ్ళాలని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


