Minister Ponguleti’s Birthday : నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి పుట్టినరోజు వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం

  • విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే జారే
  • మంత్రి పొంగులేటి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిభిరం,రోగులకు పాలు పండ్లు పంపిణీ*

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అశ్వారావుపేట నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ముందుగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరిపారు. అనంతరం చండ్రుగొండ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించిన అనంతరం సీతాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేసి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.

అన్నపురెడ్డిపల్లి మండలం కేంద్రంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన సెంటర్లో నాయకుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో వేడుకలు నిర్వహించగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు. ఆ తదుపరి అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఘనంగా నిర్వహించిన తరువాత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

State Minister Ponguleti's birthday celebrated

You cannot copy content of this page

Scroll to Top