MLA Jare Adinarayana : అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముందుగా ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ కూలీలకు కొత్త పనిముట్లు అందజేశారు. కూలీలు తక్కువ కష్టంతో ఎక్కువ పని చేయగలిగేలా ఈ పనిముట్లు ఉపయోగపడతాయని తెలిపారు. కూలీల కష్టానికి విలువ ఇవ్వడం వారికి సౌకర్యాలు కల్పించడం మా బాధ్యత అన్నారు. అనంతరం అశ్వారావుపేట బస్టాండ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలేరుపాడు మండల కేంద్రానికి కొత్త బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. జెండా ఊపి బస్సును ప్రారంభించి ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు.

ప్రజలకు రవాణా సౌకర్యం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా అవసరం ఉన్న చోట ఇలాంటి సర్వీసులు మరిన్ని ప్రారంభిస్తామని తెలిపారు. మండల కేంద్రంలో కేశిబోయిన వీరాంజనేయులు రమాదేవి దంపతుల కుమార్తె చదరంగంలో నేషనల్ స్థాయికి ఎంపికైన నేపథ్యంలో విద్యార్థిని భవ్యశ్రీని ప్రత్యేకంగా అభినందించి మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. గుమ్మడవల్లి, కొత్తూరు గ్రామంలో ఇటీవల ఐటీడీఏ పరిధిలో అశ్వారావుపేట నియోజకవర్గానికి అదనంగా కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Jare Adinarayana participated in development programs

You cannot copy content of this page

Scroll to Top