Mega Job Mela : మెగా జాబ్ మేళా ను ప్రారంభించిన కేశినేని శివనాద్, కొలికపూడి .శ్రీనివాసరావు

TRINETHRAM NEWS

తేదీ : 26/07/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం శ్రీ శ్రీ డిగ్రీ కళాశాలలో కేశినేని. ఫౌండేషన్ మరియు రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాను విజయవాడ లోక్ సభ సభ్యులు కేశినేని. శివనాథ్ (చిన్ని) తిరువూరు నియోజకవర్గం కొలిక పూడి. శ్రీనివాసరావు ప్రారంభించారు.రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ,నలభై కంపెనీలు ఏర్పాటు చేస్తాయని తెలిపారు.

ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆశాభవం వ్యక్తం చేశారు. త్వరలో నియోజకవర్గంలో లెదర్ పరిశ్రమ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని అన్నారు. పేదరికంలో ఉన్న రైతు కూలి కొడుకు కూడా చదువుకుంటే కోట్ల జీతంతో కూడిన ఉద్యోగం పొందే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో చదువుకోవడానికి అన్ని వసతులు విద్యార్థులకు ఉన్నాయని ఉన్నారు.

ఈ ఫౌండేషన్ ద్వారా ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ ,, కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంబంధించిన అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mega Job Mela

You cannot copy content of this page

Scroll to Top