Kolusu Parthasarathy : కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి

TRINETHRAM NEWS

తేదీ : 04/08/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గృహ నిర్మాణ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తిరుమల తిరుపతి దేవస్థానం స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మంచి వర్షపాతం నమోదైంది. రిజర్వాయర్లన్ని నిండి నీళ్లతో కళకళలాడుతున్నాయని అన్నారు. రైతులు వాళ్ల వ్యవసాయం, పాడి పంటలు బాగుండాలని భగవంతున్ని వేడుకున్నాను అని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన దృష్ట్యా రెండువేల నలబై ఏడు స్వర్ణాంధ్రవిజన్ లో భాగంగా రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు లభించి అందరూ అభివృద్ధి చందాలనే దిశగా తపిస్తున్నాడు, ఆ కళ నెరవేరాలని భగవంతున్ని ప్రార్థించనని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నాలను ఆ భగవంతుడు అణగదొక్కే ప్రయత్నం చేయాలని, ప్రజలందరూ వాళ్ల వాళ్ల కుటుంబాలలో శాంతియుత జీవనం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kolusu. Parthasarathy visited Tirumala

You cannot copy content of this page

Scroll to Top