Women Cricketer meet CM : సీఎం చంద్రబాబును కలిసిన శ్రీచరణి, మిథాలీ రాజ్

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలి రాజ్. క్యాంప్ కార్యాలయానికి వచ్చిన శ్రీచరణి, మిథాలి రాజ్‌కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని అభినందించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.

శ్రీచరణి, మిథాలి రాజ్‌లతో సమావేశమైన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో పంచుకున్న శ్రీచరణి. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారన్న సీఎం చంద్రబాబు.

గన్నవరం ఎయిర్ పోర్టులో శ్రీచరణికి ఘన స్వాగతం పలికిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు. శ్రీచరణి, మిథాలీ రాజ్‌ను వెంటపెట్టుకుని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఎంపీలు, మంత్రులు, శాప్ ఛైర్మన్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sricharani and Mithali Raj meet CM Chandrababu

You cannot copy content of this page

Scroll to Top