దేశభక్తిని చాటిన చెరుకుపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు.
డిండి (గుండ్లపల్లి) నవంబర్ 07 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం (నవంబర్ 7) భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అత్యంత ఉత్సాహంగా ఈ సామూహిక గేయాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, పాఠశాల విద్యార్థులు, సిబ్బంది దేశభక్తిని చాటుతూ ఒకే స్వరంతో వందేమాతరం గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి స్థానిక ఎంఈఓ ఇస్లావత్ గోప్యా నాయక్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. వందేమాతరం గీతం భారత స్వాతంత్య్ర పోరాటంలో ఉద్యమకారులకు గొప్ప స్ఫూర్తిని ఇచ్చిందని కొనియాడారు. బంకించంద్ర చటర్జీ రచించిన ఈ గీతం దేశ ప్రజలందరినీ ఏకతాటిపై నడిపి, దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి దేశం కోసం పాటుపడే స్ఫూర్తిని అలవరచుకోవాలని, మహాకవి సందేశాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చొరవ తీసుకున్నారు.
విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి ఎంపీపీఎస్ హెడ్మాస్టర్ ముడి శ్రీనయ్య, పల్లె వెంకటయ్య, లింగయ్య, నాగేశ్వరరావు, కేతావత్ సర్దార్ సింగ్, వేణు, వింజమూరి శ్రీనయ్య, శ్రీనివాస్, పుష్పలత, సుజాత, మొహమ్మద్ రవూఫ్, గొర్ల సైదులు, రేణుకాదేవి, అంగన్వాడీ సూపర్వైజర్, ఆయాలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


