400 సంవత్సరాల చరిత్రగల ప్రాచీనమైన ఆలయం, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 16 : కూకట్ పల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయo నూతన కమిటీ సభ్యుల పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ఆలయ ఆవరణలో అంగరంగ వైభవంగ జరిగింది. ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల చరిత్ర గల పురాతనమైనదిగా ఇక్కడ వేంచేసియున్న శ్రీ రాములవారు భక్తుల కోర్కెలు నెరవేర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందారు. దేవాదాయ శాఖ అధికారులు నూతన సభ్యులకు నియామక పత్రాలను అందచేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మేడ్చల్ డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి,శ్రీమతి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు, నియోజకవర్గం సీనియర్ నాయకులు, సత్యం శ్రీరంగం, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సతీష్ రెడ్డి, కొప్పిశెట్టి దినేష్, సాదు ప్రతాప్ రెడ్డి, దండుగుల యాదగిరి, తూము వేణు, తూము సంతోష్, గొట్టిముక్కల దేశాల్, గూడెపు నాగరాజు, సంజీవ రావు, గోవింద్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు మేకల రమేష్ ,కృష్ణ రాజ్ పుత్ , మరియు మహిళా అధ్యక్షురాలు పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులుగా మాధవరం శ్రీనివాస రావు (టాకిల్) మేకల సుదర్శన్, తీగల కృష్ణారావు, గుత్తికొండ వెంకట్ రావు, చెదురువల్లి శ్రీనివాస్, అంకెనపల్లి రాము, చేరుకుల రాజు యాదవ్, ముసలి బాలరాజ్, అరిగే శ్రీనివాస్, గొండ్లలా రవీందర్ గౌడ్, తూర్పటి కృష్ణవేణి, విద్యాకల్పన, బాషుపాక నాగమణి, యంజాల సుజాత. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి గ్రామం పెద్దాయన గౌరవనీయులు చింతపట్ల హనుమంతరావు హాజరై నూతన సభ్యులను ఆశీర్వదించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


