INTUC: బాలానగర్ నూతన ఏసీపీ ని కలిసిన హెచ్.ఏ.ల్ ఐ.యన్.టి.యు.సి యూనియన్ నాయకులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 16 : బాలానగర్ నూతన ఏసీపీ ని కలిసిన హెచ్.ఏ.ల్ ఐ.యన్.టి.యు.సి యూనియన్ నాయకులు బాలానగర్ నూతన ఏసీపీ గా భాద్యతలు చేపట్టిన నరేష్ రెడ్డిని ఏసీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. కూకట్పల్లి నియోజకవర్గం ఐ.యన్.టి.యు.సి అధ్యక్షులు, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్కనాగరాజు ఆధ్వర్యంలో వారికి శాలువాతో సత్కరించి ఫూల బోకె తో శుభాకాంక్షలు తెలియజేసారు.

ఏసీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయం లో ముక్కుసూటి గా పనిచేస్తానని అందరు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఏ.ల్ ఐ.యన్.టి.యు.సి అధ్యక్షులు మహమ్మద్ సిబ్గ్గాతుల్లాహ్, హెచ్ఎడభ్యు జాయింట్ సెక్రెటరీస్ డి.వెంకటపతి,నాగార్జున,ఆర్గనైసింగ్ సెక్రటరీ అబ్దుస్ షుకూర్, తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

HAL INTUC union leaders

You cannot copy content of this page

Scroll to Top