జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శ్రీ సరస్వతీ శిశు మందిర్ వికారాబాద్ పదవ తరగతి 1999 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 26 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు శ్రీ కుoదూరి విద్వాన్ రెడ్డి పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ శిశు మందిరాలు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలతో కూడిన సంస్కారం దేశభక్తి పెంపొందించడంలో కృషి చేస్తాయని అన్నారు, అలాగే విద్యార్థులందరూ శారీరక ఆరోగ్యానికి యోగ చేయాలని సూచించారు, అలాగే ప్రధానఆచార్యులు పాపిరెడ్డి రత్నాకర్ ఆచార్యులు గొడుగు సత్యనారాయణ, అనంత పద్మనాభం, మైపాల్ రెడ్డి,

రాజేందర్ రెడ్డి, యాదయ్య,రాములు, వారితోపాటు మాతాజీలు గీతానందిని,అన్నపూర్ణ, సుజాత, వసంతలు వారి సందేశంలో రెండున్నర దశాబ్దాల తర్వాత మమ్మల్ని గుర్తుంచుకొని గురువులను ఇంత అద్భుతమైన రీతిలో సన్మానించి,గౌరవించడం మాకు జీవితంలో మరువలేనిదని అలాగే విద్యార్థులందరూ ఇంకా వారి జీవితాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు, తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తెలుగు ఆచారి అయినా సోమయాజులు సార్ కు ఈ బ్యాచ్ తరపున 30000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు మరియు విద్యార్థులందరూ తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు,ఈ కార్యక్రమం శశాంక్ రెడ్డి,బసవేశ్వర్, హరీశ్వర్ రెడ్డి,వివేకానంద రెడ్డి, కిషోర్ మరియు స్వాతి,గీత, మంజులలు నిర్వహించగా సుమారు 90 మంది విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.చివరగా విద్యార్థులందరూ శిశు మందిరాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Saraswati Shishu Mandir

You cannot copy content of this page