MLA : గెలుపొందిన వాళ్లకు బహుమతులను అందజేసిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 09/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, తాడువాయి గ్రామపంచాయతీ ఆర్ మరియు ఆర్ కాలనీలో ఎండాకాలం సందర్భంగా చెడు అలవాట్లకు యువత గురి అవకుండా ఉండేందుకు టిడిపి నాయకులు బి. సురేష్ ఆధ్వర్యంలో లోకేష్ యువసేన టి _ పది నలబై ఐదు రోజులపాటు క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. పోలవరం నియోజకవర్గానికి సంబంధించిన వె లేరుపాడు మండలం, కుక్కునూరు మండలం ప్రాంత ప్రజలు కొన్ని కుటుంబాలు చల్లవారిగూడానికి రావడం జరిగింది. గోదావరి వస్తే వాళ్ల ఇళ్ళు లు మునగడంతో ప్రభుత్వం ఆర్ మరియు ఆర్ కాలనీలో ఇండ్లు కట్టించారు.
అక్కడికి వచ్చినటువంటి కుటుంబాలు గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అయితే యువత చెడిపోకుండా ఉండేందుకు నలబై ఐదు జట్లు తో క్రికెట్ ఆడగా పైనల్ కు శ్రీనివాసపురం, బుట్టాయిగూడెం తలపడ్డాయి. పదహారు పరుగుల తేడాతో శ్రీనివాసపురం జట్టు బుట్టాయిగూడెం జట్టుపై గెలుపొందింది. గెలుపొందిన వాళ్లకు పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి. బాలరాజు చేతుల మీదగా బహుమతులు అందజేశారు.
అమౌంట్ రూపంలో పారితోషకాన్ని కూడా అందించారు. ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు , క్రికెట్ చూడడానికి వచ్చిన అభిమానులకు , ఎవరికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవడం జరిగింది. మంచినీరు, భోజన సదుపాయం కల్పించారు. అదేవిధంగా ఆట ప్రారంభించినప్పటి నుండి ఫైనల్ వరకు కూడా ఎటువంటి తగాదాలు,రాకుండా కమిటీ వాళ్లు చూసుకోవడం గొప్ప విశేషం. గిల్లా.వెంకటేశ్వర్లు ఆర్ మరియు ఆర్ అధ్యక్షులు, ఆనందరావు మాజీ. మండల టిడిపి పార్టీ అధ్యక్షులు, టిడిపి కార్యదర్శి శేఖర్, యం డి. నహీమ్ టిడిపి సీనియర్ నాయకులు, వె లేరుపాడు మండల జనసేన అధ్యక్షులు ఆదినారాయణ, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామం నుండి నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. మహిళలు డైనమిక్ శాసనసభ్యులు కు ఘన స్వాగతం పలికారు.

కాలనీ లో ప్రజల సమస్యల గురించి సంబంధిత నాయకులు ఆర్జీ పత్రంపై రాసి ఎమ్మెల్యేకు ఇవ్వగా త్వరలోనే మీ సమస్యలన్నింటికీ పరిష్కారం అవుతుందని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చీకటి లోకి నెట్టింది. ఉమ్మడి కూటమి గెలిచిన తరువాత చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని సూర్యచంద్రుల వలె వెలుగులోకి తీసుకువచ్చిందని అన్నారు. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి , మరోవైపు సూపర్ సిక్స్ పథకాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి కుల, మత, పార్టీ, భాషా బేధం లేకుండా అందిస్తున్నామని అన్నారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి బ్రహ్మ రథాలు మరియు ఘన స్వాగతాలు, అభినందనలు తెలుపుతున్నారని తెలిపారు. ఎలక్షన్లు ఇప్పుడు పెట్టిన, మళ్లీ ఐదు సంవత్సరాలకు పెట్టిన కూటమికి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి తప్ప తగ్గవుని పేర్కొన్నారు. మొదటి బహుమతి, శ్రీనివాసపురం జట్టుకు, ద్వితీయ బహుమతి బుట్టాయిగూడెం జట్టుకు, తృతీయ బహుమతి చల్లవారి గూడెం జట్టు విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.పోలవరం నియోజకవర్గానికి సంబంధించిన నిర్వచితులు ఉండే భూమి చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించింది కాబట్టి పోలవరం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి. బాలరాజు చింతలపూడి నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు యస్. రోషన్ కుమార్ తో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మా బాధ్యతగా నిర్వాసితులకు న్యాయం చేస్తామని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA presented prizes to

You cannot copy content of this page

Scroll to Top