National Lokadalat : జూన్ 14న జాతీయ లోకాదాలత్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో వికారాబాద్ న్యాయవాదుల బార్ అసోసియేషన్ లొ ఏర్పాటు చేసిన న్యాయవాదుల సమావేశంలో జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్ర కిశోర్ పాల్గొన్నారు. ఈనెల 14న జరగబోయే జాతీయ లోకాదాలత్ లొ అధిక సంఖ్య లొ కేసులు రాజిపడేలా చూడాలని న్యాయవాదులకు జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్ర కిశోర్ తెలిపారు.

రాజీ పడేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థులకు ఈ రోజు నుండి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాజీమార్గమే రాజమార్గం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ వెంకటేశ్వర్లు , జూనియర్ సివిల్ జడ్జి శాంతలత , బార్ ప్రెసిడెంట్ బసవరాజ్ , బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మరియు ఇతర సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదుల పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

On June 14, National Lokadalat

You cannot copy content of this page

Scroll to Top