
Sri Rama Navami : త్రినేత్రం న్యూస్ : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవరకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పాల్గొని స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఇంటిలో సుఖశాంతులు, ఐశ్వర్యం నెలకొనాలని ఆకాంక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ…, శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా, సత్యనిష్ఠకు ఆదర్శంగా నిలిచిన మహానుభావుడని పేర్కొన్నారు. రాముని జీవితం నీతి, న్యాయం, కర్తవ్యబోధలను నేర్పుతుందని, ప్రతి ఒక్కరూ రాముడు చూపిన మార్గంలో నడుస్తూ సద్గుణాలను అలవర్చుకోవాలని సూచించారు.
సమాజంలో పరస్పర గౌరవం, సహనం, సత్యనిష్ఠ వంటి విలువలను పెంపొందించుకోవడం ద్వారా ఆదర్శవంతమైన పౌరులుగా ఎదగగలమని అన్నారు. అలాంటి పౌరుల సమిష్టి కృషితోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లవచ్చని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ప్రజల మధ్య ఐక్యత, సౌహార్దం పెంపొందిస్తూ, ధర్మబద్ధమైన జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా సమాజం శాంతి, సమృద్ధి వైపు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, రామ భక్తులు మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

