Karthika Brahmotsava Booklet : శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల బుక్‌లెట్‌ ఆవిష్కరణ

TRINETHRAM NEWS

Trinethram News : తిరుమ‌ల‌, 2025 అక్టోబ‌రు 28: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల బుక్‌లెట్‌ను టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌తో క‌లిసి ఆవిష్కరించారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం సాయంత్రం టీటీడీ బోర్డు స‌మావేశం అనంత‌రం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ, నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుందన్నారు. నవంబరు 16వ తేదీన లక్షకుంకుమార్చన, అంకురార్పణ నిర్వహిస్తారని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా నవంబరు 17న ధ్వజారోహణం, 21న గజ వాహనం, 22న స్వర్ణరథం, గరుడ వాహనం, 24న రథోత్సవం, 25న పంచమితీర్థం, 26న పుష్పయాగం నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ వెంక‌య్య చౌద‌రి, ప‌లువురు బోర్డు స‌భ్యులు, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Padmavati Ammavari Karthika Brahmotsava Booklet Launched

You cannot copy content of this page

Scroll to Top