తేదీ : 28/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజవర్గం, మండలం , సబ్ కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ అధికారులు మరియు పార్టీ నాయకులతో మొంథా తుఫాన్ ప్రభావంపై సమీక్షా సమావేశం రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు. పార్థసారథి ఆయన మాట్లాడుతూ తుపాను పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది అని తెలిపారు. గర్భిణీలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి అని సూచించారు.ప్రజల భద్రత కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అని చెప్పారు.
అదేవిధంగా, వరద ప్రభావిత ముంపు ప్రాంతాలు మరియు పునరావాస కేంద్రాల్లో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వాళ్లకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


