
Sports Day : త్రినేత్రం న్యూస్ :మార్చ్ 31: నెల్లూరు జిల్లా : కడనూతల : బోగోలు మండలం కడనూతల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం సాయంత్రం 18వ స్పోర్ట్స్ డే ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివిఎన్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుదీర్ఘకాలం పాటు ప్రముఖ డిగ్రీ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్ గా మరియు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన వై కోటేశ్వరమ్మ , పాల్గొన్నారు అని తెలిపారు.
అతిధి కోటేశ్వరమ్మ , మాట్లాడుతూ క్రీడలు, ఆటలలో నిరంతరం పాల్గొంటున్న వారికి మంచి శరీరాకృతి, కండరాల పటుత్వం, ఎముక పుష్టి తోపాటు నరాలు చక్కగా పనిచేస్తూ మంచి జ్ఞాపకశక్తిని అందిస్తుందని, అలాగే మానవుని జీవిత ఆయుష్ కూడా పెరుగుతుందని బీటెక్ విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం ఇటీవల నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ మరియు గేమ్స్ లలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్ తో పాటు షీల్డ్స్ ను అందజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ,ఆర్ఎస్ఆర్ కార్నివాల్, పేరుతో యూత్ ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించారు.
ఈ యూత్ ఫెస్టివల్ల విద్యార్థిని విద్యార్థులలో దాగివున్న వ్యాపార లావాదేవీలలో మెలకువలు తెలుసుకొనుటకు ఎంతగానో దోహదపడుతుందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ కే.రాజారెడ్డి , తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో ఆర్వి రమణారెడ్డి, పిడి ఏ. కిరణ్ కుమార్ అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

