జూలై 16, 2026
TRINETHRAM NEWS
Special Dua Program at Jamia Masjid

​Special Dua Program : త్రినేత్రం న్యూస్ : రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వినుకొండ పట్టణంలోని స్థానిక జామియా మసీదులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక దువా (ప్రార్థన) కార్యక్రమం నిర్వహించారు.
​ఈ సందర్భంగా ఆయనపై మోపిన తప్పుడు కేసులు తొలగిపోవాలని, ఆయన నిర్దోషిగా త్వరలోనే విడుదల కావాలని అల్లాహ్‌ను మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధం

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం పోరాడుతున్న ప్రజా నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు పై రాజకీయ ద్వేషంతో అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపు చర్యలకు వైఎస్సార్‌సీపీ భయపడదని, న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కరిక్రామం లో వైఎస్‌ఆర్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు పీఎస్‌ఖాన్‌ నియోజకవర్గం అధ్యక్షులు హాఫీజ్ గౌస్ బాషా మాజీ కౌన్సిలర్ రఫీ మైనారిటీ నాయకులు ఖాదర్ బాషా అత్తర్ నాగుర్ సుబానీ కరీమ్‌సెట్ మున్నా హసన్ ఫకృద్దీన్ బుజ్జి యాసిన్ మస్తాన్ వాలి మరియు ముస్లిం మాత పెద్దలు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page