
Bolla Brahmanaidu : వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పలు అంశాలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, అది ప్రతి రైతును అడిగితే తెలుస్తుందని తెలిపారు.
ప్రస్తుతం రైతులు మొక్కజొన్న పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితి నెలకొన్నదని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలను మూసివేయడంపై ప్రశ్నించారు. ప్రతి రైతుకు ఎకరాకు లక్ష రూపాయల సబ్సిడీ ఇస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని ఆరోపించారు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామన్న హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కూటమి నాయకులు, ముఖ్యమంత్రి, ఎంపీలు, ఉప ముఖ్యమంత్రి పేరును మాత్రమే ప్రస్తావిస్తూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ కూడా బ్లాక్ మార్కెట్‌లో దొరకని పరిస్థితి ఉందని తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలో భూకబ్జాలు విపరీతంగా జరుగుతున్నాయని, అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టి భూములను అమ్ముతున్నారని ఆరోపించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భూముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

