Speaker Campaigning : వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న స్పీకర్

TRINETHRAM NEWS

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రసాద్ కుమార్

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ పురపాలక సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వార్డు అభ్యర్థుల విజయానికి మద్దతుగా ఈరోజు 9, 16,17,27 వార్డుల పరిధిలోకి వచ్చే గంగారాం లో రోడ్ షో నిర్వహించి, ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసిన వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ .

పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గడ్డం అనన్య గారు, వార్డు అభ్యర్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు.

ఈసందర్భంగా కార్నర్ మీటింగ్ లో గడ్డం ప్రసాద్ కుమార్ గారు మాట్లాడుతూ.. గత రెండేళ్లలో వికారాబాద్ మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులకు వంద కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించాను.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి ఉన్నారు, నేను స్థానిక శాసనసభ్యుడుగా రాష్ట్ర స్థాయిలో స్పీకర్ హోదాలో ఉన్నాను. నా కూతురు గడ్డం అనన్య మున్సిపల్ చైర్మన్ హోదాలో ఉంటుంది, మీ వార్డు కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ పార్టీ నుండి ఉంటే మీ కాలనీలు అభివృద్ధి అవుతాయి.
వేరే పార్టీలకు ఒటు వేస్తే వృధా అవుతుంది. ఆలోచన చేసి వికారాబాద్ పట్టణం అభివృద్ధి కోసం చేతి గుర్తుకు ఓటు వేయండి. కౌన్సిలర్ అభ్యర్థులు అందరూ గెలిస్తేనే అనన్య చైర్మన్ అవుతుంది. మీ అందరి ఆశీర్వాదం నా బిడ్డ మీద ఉండాలి.

ఈసందర్భంగా గడ్డం అనన్య గారు మాట్లాడుతూ.. అమ్మలు, అక్కలందరికి నమస్కారం. నేను రాజకీయాల లోకి వచ్చిందే ప్రజలకు సేవ చేయడానికి, మనమందరం ఒక కుటుంబం. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో మీ బాధలను, కష్టాలను చూశాను, వాటిని తీర్చాలని ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గా వస్తున్నా.

మీ ప్రతి సమస్యపై నాకు అవగాహన ఉన్నది. అన్నింటినీ పరిష్కరిస్తాను. అసెంబ్లీ స్పీకర్, స్థానిక శాసనసభ్యులైన మా నాన్న గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో వికారాబాద్ పట్టణ రూపురేఖలు మారుస్తాను

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Speaker campaigning in Vikarabad municipal elections

You cannot copy content of this page

Scroll to Top