వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పేస్-3 ఎన్నికలలో భాగంగా డీఆర్‌సీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, ఐ పి ఎస్ పేస్-3 ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, ఐపీఎస్ ఈ రోజు జిల్లాలోని పలు డీఆర్‌సీ కేంద్రాలను సందర్శించి, ఎన్నికల ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పకడ్బందీ ఏర్పాట్లు మరియు భద్రతా చర్యలను సమీక్షించే లక్ష్యంతో ఈ పర్యటన చేపట్టారు. ముఖ్యంగా కుల్కచర్ల, దోమ, పరిగి పోలీస్ స్టేషన్ల పరిధిలోని డీఆర్‌సీ కేంద్రాలలో ఎస్పీ పర్యటించారు.
ఈ సందర్భంగా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర గారు ఎన్నికల నిర్వహణ అధికారులు మరియు పోలీస్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ, తరలింపు మరియు తిరిగి భద్రపరిచే ప్రక్రియలపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు.ఈ కీలక ప్రక్రియలన్నీ ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా, పటిష్టమైన భద్రత మధ్య జరిగేలా చూడాలని పోలీస్ అధికారులకు మరియు ఇతర ఎన్నికల సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ముఖ్యంగా రవాణా మార్గాలలో బందోబస్తు, కేంద్రాలలో పటిష్టమైన పోలీస్ పహారా మరియు ఎన్నికల సామాగ్రి భద్రతపై నిఘా ఏర్పాటుపై పోలీస్ అధికారులతో చర్చించి తగిన సూచనలు అందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


