
Software Engineer Commits Suicide : త్రినేత్రం న్యూస్ : Aug 01, 2026, ఆంధ్రప్రదేశ్ : నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చీరల రాధ గురువారం అర్ధరాత్రి కుప్పం రైల్వే స్టేషన్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త బెట్టింగ్‌కు బానిసై రూ.లక్షలు నష్టపోవడంతో కుటుంబంలో తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదురయ్యాయి.
అప్పులు తీర్చేందుకు పుట్టింటివారు రూ.40 లక్షలు సాయం చేసినా భర్తలో మార్పు రాలేదు. దీంతో సమస్యను పెద్దలతో చర్చించేందుకు బెంగళూరు నుంచి వస్తున్న సమయంలో ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఆమె బ్యాగులో సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe