మధ్యాహ్నభోజన పథకం మెనూ పరిశీలన.
10వ తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం.
డిండి (గుండ్ల పల్లి) నవంబర్ 28 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి: ఎస్ఓ-4 కత్తుల రవీందర్ శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెరుకుపల్లిని సందర్శించారు. సందర్శనలో భాగంగా రవీందర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి, పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం(ఎం డీ ఎం) మెనూ వివరాలను, నాణ్యతను గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా, ఆయన ప్రత్యేకంగా పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి, మంచి ఉత్తీర్ణత సాధించాలని, తద్వారా తల్లిదండ్రులకు, చదువు చెప్పిన ఉపాధ్యాయులకు, మరియు చదివిన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.
విద్యార్థులను బాగా చదవమని, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి స్ఫూర్తిని ఇచ్చారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల పురోగతిని పర్యవేక్షించేందుకు విద్యాశాఖ తరపున ఈ సందర్శన కార్యక్రమం జరిగిందని తెలిపారు. వారివెంట ఎంఈఓ ఇస్లావత్ గోప్యా నాయక్, ఎంఐఎస్ గొర్ల సైదులు, ఉపాధ్యాయులు పల్లె వెంకటయ్య, భూక్య నాగేశ్వరరావు, ఆకాశపు లక్ష్మీ, శ్యామల సుజాత, శ్రీనివాస్, కేతావత్ సర్దార్ సింగ్ రాథోడ్, వింజమూరి శీనయ్య, రమావత్ వాసవి, సంకు శోభన్ బాబు, పగిళ్ల పుష్పలత, సీఆర్పీ శైలజ తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


