Mahatma Jyotirao Phule : సామాజిక న్యాయ దీప్తి మహాత్మా జ్యోతిరావ్ ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

TRINETHRAM NEWS

సంగారెడ్డి: బడుగు, బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడి, సమాజ సంస్కరణలకు మార్గదర్శకుడిగా నిలిచిన మహాత్మా జ్యోతిరావ్ ఫూలే వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలో ఘనమైన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. నేటివ్ ఇండియన్స్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్తలు, యువజన సంఘాలు, స్థానిక నాయకులు పాల్గొని, ఫూలే చూపిన సమానత్వ మార్గం పట్ల తమ అంకితభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నేటివ్ ఇండియన్స్ ఫోరం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బత్తుల విక్రమ్ మాట్లాడుతూ, “ఫూలే గారి పోరాటం కేవలం ఒక యుగానికి మాత్రమే కాదు, నేటి తరానికీ సామాజిక న్యాయ దీప్తిగా నిలుస్తోంది. విద్య, మహిళా సాధికారత, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చూపిన మార్గం మా ఉద్యమాలకు శాశ్వత ప్రేరణ” అని పేర్కొన్నారు.
కార్యక్రమానికి అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి టౌన్ అధ్యక్షుడు ఎస్.ఆర్. ప్రమోద్ కుమార్, సంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ బేగరి పురుషోత్తం మరియు తాజా మాజీ ఎంపీటీసీ కంది నందకిషోర్, రచయిత, ప్రజా గాయకుడు డప్పోల్ల రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫూలే సిద్ధాంతాలు సమాజాన్ని అలుముకున్న అసమానతలను ఛేదించేందుకు ఎంతగానో దోహదపడ్డాయని వారు పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఉద్ధరణ కోసం ఫూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, సమాన హక్కుల కోసం తమ ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తామని స్పష్టంచేశారు.
కార్యక్రమంలో పలువురు ప్రాంతీయ ప్రజా నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొని ఫూలే విగ్రహం పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజానికి వెలుగునిచ్చిన మహానుభావుల జ్ఞాపకాలను చరిత్రలో నిలబెట్టుకోవాలని, దీర్ఘకాలిక సామాజిక మార్పుకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని హాజరైన నాయకులు పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tributes paid to Mahatma Jyotirao Phule

You cannot copy content of this page

Scroll to Top