సిపిఐ పూర్వ జిల్లా కార్యదర్శి గౌతం గోవర్ధన్.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం లో జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ లకు గత కొన్ని నెలల నుంచి బిల్లులు చెల్లించడం లేదని, అదేవిధంగా ఇట్టి పథకం కింద పని చేస్తున్న కార్మికుల కు వేతనం 3000/- రూపాయలు జనవరి నుంచి చెల్లించడం లేదని, వెంటనే ఏజెన్సీ లకు బిల్లుల చెల్లింపు తో పాటు కార్మికుల కు పెండింగ్ వేతనాలు చెల్లించాలని సిపిఐ పూర్వ జిల్లా కార్యదర్శి గౌతం గోవర్ధన్ ఒక ప్రకటన లో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం గోదావరిఖని సింగరేణి సెక్టార్ వన్ స్కూల్ కు వెళ్ళి అక్కడ పని చేస్తున్న కార్మికుల సమస్యల ను అడిగి తెలుసుకున్న అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పోషక ఆహారం అందించడం తో పాటు విద్యార్థులు డ్రాపౌట్ కాకుండా కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని,
ఈ పథకం కింద ప్రభుత్వం ఏజెన్సీ లకు బియ్యం సరఫరా చేస్తున్నారని, వంటకు కావలసిన నిత్యావసర వస్తువులు ఏజెన్సీ లు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేసి పిల్లలకు భోజనం పెడుతున్నారని, కానీ ప్రభుత్వం వీరి పెట్టుబడి పెట్టిన బిల్లులు చెల్లించడం లేదని, దీని వల్ల వారు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు, వెంటనే వారికి బిల్లులు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా అందులో పని చేస్తున్న కార్మికుల కు జనవరి 2025 నుంచి వేతనం చెల్లించడం లేదని కార్మికులు తమ ఆవేదన ను వ్యక్తం చేశారని, వెంటనే వారికి కూడా పెండింగ్ లో ఉన్న వేతనం చెల్లించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


