త్రినేత్రం న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి. సింగరేణిలో మారుపేర్లు మరియు విజిలెన్స్ పేరిట పెండింగ్‌లో ఉన్న కేసుల బాధితులు ఆదివారం (డిసెంబర్ 28) హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో సింగరేణి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.
గత అనేక ఏళ్లుగా సింగరేణి యాజమాన్యం విజిలెన్స్ విచారణల పేరుతో తమ ఉద్యోగాలను పెండింగ్‌లో పెట్టిందని, దీనివల్ల తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తమ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు.
దీనిపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని, కార్మికుల పక్షపాతి అయిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ విషయమై రాబోయే రెండు రోజుల్లో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్, ఐఎన్‌టీయూసీ (ఇటుక్) యూనియన్ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు. భూపాలపల్లి సభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని త్వరలోనే నెరవేరుస్తామని, బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ధనాడ రాజు, పార్థపల్లి హరీష్, రామిళ్ళ సందీప్, ఇంజపల్లి ఓం ప్రకాష్, వెంపటి సతీష్, కొమురమ్మ, సాయి కుమార్ మరియు మారుపేర్ల కార్మికుల పిల్లలు, తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


