ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రాణరక్షణలో ముందుండి ప్రమాద బాధిత మహిళను ఆసుపత్రికి చేర్చిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు
త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి.. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్, గోదావరిఖని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.
సంఘటన సమయంలో అక్కడే ఉన్న రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు వెంటనే స్పందించి గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే ప్రమాదానికి కారణమైన కారును, డ్రైవర్‌ను గోదావరిఖని వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు.
విధుల్లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా నిర్వహిస్తూనే, మానవత్వాన్ని చాటుతూ ఇన్‌స్పెక్టర్ చూపిన చొరవను స్థానికులు అభినందించారు.
ఈ ఘటనతో ట్రాఫిక్ పోలీసులు ప్రజల భద్రతతో పాటు ప్రాణరక్షణలోనూ ముందుంటారనే నమ్మకం ప్రజల్లో మరింత బలపడిందని వారు పేర్కొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


