New Sarpanch : ముస్త్యాల గ్రామ నూతన సర్పంచ్ కు ఘనంగా సన్మానం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్/గోదావరిఖని ప్రతినిధి.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రమంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ సుంకరి మహేష్, మరియు ఉప సర్పంచ్ బాసినేని వినోద సత్యనారాయణ ను వారి మిత్రమండలి శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నన్ను ఆదరించి నామీద నమ్మకంతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అలాగే ముస్త్యాల గ్రామానికి ఎల్లవేళలా వారితో మమేకమై ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం ఎల్లవేళల కృషి చేస్తానని ఆయన అన్నారు. నేను చెప్పిన హామీలు తప్పకుండా నెరవేరుస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో వారి మిత్రులు షేక్ జమీల్ హుస్సేన్, కొండ్ర అంజయ్య, కాపుర బోయిన సతీష్, షేక్ గౌస్ పాషా, షేక్ యాకుబ్, షేక్ ఇంతియాజ్, షేక్ తాజాద్దీన్ బాబా, గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బేరపున్నం చందర్,సుందిల్ల రాజు, బొడ్డుపెల్లి రవి, సిద్ద శేఖర్, సుందిల్ల సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A grand felicitation to the new Sarpanch of Mustyala village

You cannot copy content of this page

Scroll to Top