ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
Sindhu wins

Sindhu Wins : త్రినేత్రం న్యూస్ : ఆదివారం (జులై 19) జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో మెరుపుల్లాంటి స్మాష్‎లు, వ్యూహాత్మక డ్రాప్ షాట్‌లతో మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన యమగూచిపై సింధు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఆట మొదటి నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కొంచెం కూడా ఒత్తిడికి గురికాకుండా సింధు చాలా దూకుడుగా ఆట కొనసాగించింది.

సొంత గడ్డపై యమగుచిని కేవలం 50 నిమిషాల్లోనే భారత షట్లర్ మట్టికరిపించింది. యమగూచి ప్రతిఘటించే ప్రయత్నం చేసిన సింధు ఆ అవకాశం ఇవ్వలేదు. 21-17, 21-17 తేడాతో వరుస సెట్లలో భారత షట్లర్ విజయం సాధించింది. తద్వారా తొలిసారి జపాన్ ఓపెన్ టైటిల్‎ను సింధు కైవసం చేసుకుంది.

అంతేకాకుండా ఈ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్ గా సింధు రికార్డ్ క్రియేట్ చేసింది. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత ఆమె గెలుచుకున్న మేజర్ టైటిల్ ఇదే. దీంతో మేజర్ టైటిల్ కోసం సింధు ఏడేళ్ల నిరీక్షణ ముగిసింది.

ఈ విజయంతో యమగుచిపై తన హెడ్-టు-హెడ్ రికార్డ్‎ను సింధు 16-14కు పెంచుకుంది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page