Shock to Congress Party : కాంగ్రెస్ పార్టీకి షాక్

TRINETHRAM NEWS

బిఆర్ఎస్ పార్టీలో చేరిన మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బురాన్

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 05, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డుకు చెందిన మాజీ మార్కెట్ డైరెక్టర్ బురాన్ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన బురాన్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……మన తెలంగాణను కాపాడుకోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలి అని ఆయన కోరారు.ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్లు ఐదేళ్లు ఉంటారు.. రెండేళ్లలో వచ్చేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే అని ఆయన అన్నారు.

కేసీఆర్ ముస్లిం మైనార్టీ పిల్లల చదువు కోసం ఆలోచించి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. షాదీ ముబారక్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చాక మైనార్టీల కోసం ఒక్క రూపాయి పని చేశారా అని ఆయన అడిగారు.రెండేండ్ల కాంగ్రెస్ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. రేవంత్ సర్కార్ ను గద్దె దించేందుకు ప్రజలు వారి ఓట్లతో గుణపాఠం చెప్పాలని… బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై వారి అమూల్యమైన ఓటు నమోదు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేతావత్ బిల్యా నాయక్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు టీ వీ ఎన్ రెడ్డి,గాజుల ఆంజనేయులు,నీల రవికుమార్,16వ అభ్యర్థి కేతావత్ రూప్లా నాయక్, పులిరాజ్ గౌడ్,జమీర్ బాబా, ఇలియాస్ పటేల్, ఇమ్రాన్,కేతావత్ లాలు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Shock to Congress Party

You cannot copy content of this page

Scroll to Top