Online Orientation Training : మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులకు ఆన్‌లైన్ నందు ఓరియంటేషన్ శిక్షణ

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి… మునిసిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్ పోలీసు అధికారులకు ఆన్‌లైన్ ద్వారా ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ శిక్షణలో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు మరియు సిబ్బంది విధి నిర్వహణలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద పాటించాల్సిన డూస్ అండ్ డోంట్స్, ఎన్నికల నియమావళి ప్రకారం 100 మరియు 200 మీటర్ల పరిధిలో నిబంధనల కట్టుదిట్టమైన అమలు, అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించడం, నిబంధనల ఉల్లంఘన జరిగితే తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన అవగాహన కల్పించారు.

ఎన్నికల సమయంలో ఎన్ఫోర్స్‌మెంట్ చర్యలు, అక్రమంగా నగదు, మద్యం తదితర ప్రలోభకర వస్తువుల తరలింపును అరికట్టేందుకు వాహన తనిఖీలు, క్యాష్ సీజ్ ప్రక్రియలు కచ్చితంగా చేపట్టాలని సూచించారు. అలాగే ఎన్నికల నిర్వహణలో వర్తించే ముఖ్యమైన చట్ట విభాగాలు (సెక్షన్లు) మరియు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

ఈ ఆన్‌లైన్ ఓరియంటేషన్ శిక్షణ ద్వారా క్షేత్రస్థాయి పోలీసు అధికారులు మరియు సిబ్బందిలో ఎన్నికల నిర్వహణపై ఉన్న సందేహాలను నివృత్తి చేసి, వారిని పూర్తి స్థాయిలో ఎన్నికల విధులకు సమాయత్తం చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్ తెలిపారు.

ఇట్టి కార్యక్రమం లో డీటీసీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ జానయ్య, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, పరిగి డీ సి ఆర్ బీ శ్రీనివాస్, తాండూర్ డీఎస్పీ యాదయ్య లు,సీఐ లు, ఎస్.ఐ లు, సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Online orientation training for police officers

You cannot copy content of this page

Scroll to Top