సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Shekhar Reddy

ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి తీదేడు గ్రామ సర్పంచ్

Shekhar Reddy : చింతపల్లి ఆగష్టు 25, త్రినేత్రం న్యూస్. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.గ్రామంలోని ప్రజలు,యువత, మహిళలు మరియు గ్రామ సిబ్బందితో కలిసి ఆమె మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అమె అన్నారు.గ్రామంలో పచ్చదనం పెంచేందుకు విస్తృతంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ప్రజలకుసూచించారు.
నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు, పంచాయతీసిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page