సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Bags Distribution

పేద విద్యార్థులకు అండగా నిలవాలి : మండల విద్యాధికారి రవిందర్ రాజు

Bags Distribution : కూకట్పల్లి ఆగస్టు 25 (త్రినేత్రం న్యూస్) : యూత్ ఫర్ సేవా, ఓ సాఫ్ట్వేర్ సంస్థ ఆధ్వర్యంలో కూకట్ పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు బ్యాగుల పంపిణీ చేశారు. బుధవారం ఉదయం పాఠశాల ఆవరణలో కూకట్ పల్లి మండల విద్యాధికారి రవీందర్ రాజు ఆధ్వర్యంలో సుమారు 400 విద్యార్థులకు బ్యాగులను అందజేశారు.

ఈ సందర్బంగా ఎం ఈ ఓ రవీందర్ రాజా మాట్లాడుతూ పేద మధ్యతరగతి చెందిన విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాల విద్యార్థులకు చేయితనందించడం అభినందనీయమన్నారు. యూత్ సామాజిక సేవా కార్యక్రమంలో ముందుండి పేద విద్యార్థులకు అండగా నిలవాలని ఆయన కోరారు. స్వచ్ఛంద సంస్థల అందించే సహకారంతో ప్రభుత్వ పాఠశాలలను ఉత్తమంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సేవా ప్రతినిధులు, సాఫ్ట్ ప్రతినిధులు, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page