
SFI : అల్లూరిజిల్లా అరకులోయ జూలై 25, (త్రినేత్రం న్యూస్): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండల కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ, సీఐటీయూ, ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే విధంగా జరిగిన నీట్ పేపర్ లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, కుట్రకు పాల్పడిన వారందరినీ చట్టపరంగా శిక్షించాలని కోరారు. నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసు అధికారులపై కూడా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
అలాగే ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న హెల్త్ అసిస్టెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, విద్యాసంస్థల్లో పెంచిన ఫీజులను తగ్గించి విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించాలని కోరారు.
ఈ ధర్నాలో ఆదివాసి గిరిజన సంఘం నాయకులు కె. రామారావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. ఐసుబాబు, భీమరాజు, గౌతం, సంహాద్రి, చరణ్, సంజీవ్, గిరిజన సంఘం మండల నాయకులు పాంగి రామన్నతో పాటు పలువురు విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe