
Grand Parents-Teachers Meeting : అరకులోయ, జూలై 25, (త్రినేత్రం న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0″ కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం చోంపి పంచాయతీ పరిధిలోని పప్పుడువలస గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ( టి.డబ్ల్యూ) పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు జయంతి, భాష పండితుడు సీతారాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్, వైయస్సార్ సిపి అరకు లోయ మండల పార్టీ ఉపాధ్యక్షులు గుడివాడ ప్రకాశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గుడివాడ ప్రకాశ్‌రావు మాట్లాడుతూ, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి విద్యాభివృద్ధిపై చర్చించే అవకాశాన్ని కల్పించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు తల్లిదండ్రులు, విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు, అదేవిధంగా
విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించి, తల్లిదండ్రుల మాట వినడంతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడిక అలవర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యమో, వారి వ్యక్తిత్వ వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర కూడా అంతే కీలకమని ప్రకాష్ రావు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో విద్యా కిట్ల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో అవసరమైన చోట కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పలు గ్రామాల్లో పాఠశాలల కొరత కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామానికి నాణ్యమైన విద్యను అందించిన రోజే నిజమైన విద్యా పండుగగా నిలుస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, మరియు ఎంపీటీసీ జానకి మరియు వార్డు సభ్యురాలు సన్యాసమ్మ, స్కూల్ చైర్మన్ శుక్ర, పెసా కమిటీ సభ్యుడు మల్లేశ్, అంగన్‌వాడీ టీచర్లు ఆదిలక్ష్మి , కుమారి, హెల్పర్లు కొండమ్మ , పద్మ ,ఆశ వర్కర్ బంగారమ్మ గ్రామస్తులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe