CITU : ఆటో కార్మికుల జీవనోపాధి కాపాడాలి సిఐటియు

TRINETHRAM NEWS

అల్లూరుజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ ఆగస్టు 15 : ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ప్రభుత్వ నిర్ణయం ఆటో కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని సిఐటియు ఆందోళన వ్యక్తం చేసింది. అరకు వ్యాలీ నాలుగు రోడ్ల సెంటర్లో బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నిరసన చేపట్టారు.
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ఈ పథకం వల్ల పట్టణాలు, గ్రామాల్లో ఆటో రిక్షా డ్రైవర్ల ఆదాయం పడిపోతోందని, పెట్రోల్–డీజిల్ ధరల పెరుగుదల, రుణ భారం, వాహన సంరక్షణ ఖర్చులు భరించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
ప్రభుత్వం ఆటో కార్మికులకు రుణ సబ్సిడీ, ఇంధన సబ్సిడీ, బీమా సబ్సిడీతో పాటు సంవత్సరానికి 25,000 ఆర్థిక సాయం అందించాలని, ఆటో కొనుగోలు కోసం ఐదు లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు శంకర్రావు, ఉపాధ్యక్షులు శ్రీను, మరియు రాము, ఆనంద్, కోగేశ్వరరావు, గంగరాజు, రమేష్, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CITU should protect auto workers

You cannot copy content of this page

Scroll to Top