అశ్వారావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే విస్తృత పర్యటన
త్రినేత్రం న్యూస్ 19.04.2025 – శనివారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావుపేట మండలం.
అశ్వారావుపేట మండలం లో, పర్యటించిన, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం. కోసం, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన. ఇందిరమ్మ బడిబాట కార్యక్రమం లో, భాగంగా పలు గ్రామ పంచాయతీలలో, ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి. అమ్మ ఆదర్శ పాఠశాల, నిధులతో ఆయా పాఠశాలల్లో, కల్పించిన మౌలిక వసతులను, పరిశీలించారు. కార్యక్రమంలో, భాగం గా పలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పోషణ పక్షం కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలకు, శ్రీ మంతాలు, విద్యార్థుల కు అక్షరా భ్యాసాలు వారి చేతుల మీదుగా, నిర్వహించారు. అలాగే, అనారోగ్యంతో బాధపడుతున్న పలు కుటుంబాలను పరామర్శించి. మెరుగైన వైద్యం అందిస్తానని, సూచించారు.
ఇందిర బడిబాట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు
- పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి
ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసతుల కల్పన - ఇంగ్లిష్ మీడియం
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు. - అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు
పాఠశాలల అభివృద్ధికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం. - ఇందిర బడిబాట కార్యక్రమం
ఇందిర బడిబాట కార్యక్రమం, ద్వారా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి. విద్యార్థుల సంఖ్య పెంచడం కొరకు కృషి చేయడం. - మధ్యాహ్న భోజన పథకం
విద్యార్థులకు నాణ్యమైన, మధ్యాహ్న భోజనం అందించడం. - డిజిటల్ తరగతి గదులు
పాఠశాలల్లో, డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆధునిక విద్యా సౌకర్యాలు అందిచడం. - స్వచ్ఛత
పాఠశాలల్లో స్వచ్ఛతపై అవగాహన పెంచేందు.కు ప్రత్యేక కార్యక్రమాలు, నిర్వహించడం. - ప్రత్యేక టాయిలెట్లు
బాలికల సౌకర్యార్థం ప్రత్యేక టాయిలెట్లు నిర్మాణం. - మరమ్మతులు
పాఠశాలలు పునఃప్రారంభానికి, ముందు అవసరమైన మరమ్మతులు పూర్తిచేయడం. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు , ఎం.పీ.డీ.వో ప్రవీణ్, కుమార్ .మండల, స్పెషల్ ఆఫీసర్ Dr ప్రదీప్ కుమార్ ,
ఆర్ .ఐ పద్మావతి , ఎం. ఈ. ఓ. ప్రసాద్ , పి.ఆర్. ఏ. ఈ అక్షిత , ఇరిగేషన్ డి. ఈ L. కృష్ణ ,ఏ.ఈ కృష్ణ . జూపల్లి ప్రమోద్, పల్లెల రామ లక్ష్మయ్య , జుజ్జూరి దుర్గారావు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సోమవరపు నాగ కిషోర్, ఫణి. గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


