అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 20: ఒడిస్సా రాష్ట్రం నుండి వచ్చి అరకు లోయలో దొంగ ఎస్టీ సర్టిఫికెట్లతో చలామణి అవుతున్న వివరాలు అందజేయాలి. ఎండపల్లి వలస గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం శనివారం నాడు అరకు నియోజకవర్గం,అరకు వ్యాలీ మండలం,ఎండపల్లి వలస గ్రామ సచివాలయాన్ని అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం, ఆకస్మికంగా సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. బ్రతుకుతెరువు కోసం ఒడిస్సా రాష్ట్రం నుండి అరకు వ్యాలీ వచ్చి దొంగతనంగా పద్మపురం పంచాయతీ పరిధి గల సంతోష్ నగర్లో ఎస్టీ సర్టిఫికెట్లతో చలామణి అవుతూ,అక్రమంగా ఇల్లు నిర్మిస్తూ జీవిస్తున్న వారి వివరాలను త్వరితగతిన అందజేయాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం ఎండపల్లి వలస ఎపిఆర్ గర్ల్స్ హై స్కూల్ ను సందర్శించి,వంటశాలను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందజేయాలని హాస్టల్ వార్డెన్ ను ఆదేశించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


