మంచిప్రభుత్వం వచ్చిందన నమ్మం.మహిళాలనువేధింపులు గురి చేసే వ్యక్తులను ప్రోత్సహించకండి.
త్రినేత్రం న్యూస్ , కాకినాడ,డిసెంబర్,23: ఏపీ మెడికల్ కాంట్రా క్ట్ ఎంప్లాయిస్& సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ ఏఐటియూసి అనుబంధ సంఘం కాకినాడ జిజిహెచ్ కమిటీ అధ్యక్షులు కె.వి.రామయ్య ఆధ్వర్యంలో ఈరోజు సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు పెంపుదలపై, వారి సమస్యలపై ఉదయం మస్టర్ సమయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు.
ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ కాంట్రాక్టర్ జూన్ నెల నుండి ప్రారంభమైందని, ఆనాటి నుండి నేటి వరకు సెక్యూరిటీ గార్డ్ సమస్యలు పరిష్కరించడంలో కాంట్రాక్టర్ పూర్తిగా విఫలమయ్యారని, అదనపు డ్యూటీల బకాయి వేతనాలు ఇప్పటికీ చెల్లించలేదని, క్యాజువల్ లీవ్స్ అమలు చేయాలని, 138 జీవో ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సామాన్య, వైద్య విధాన, ఏరియా, సిహెచ్, పిహెచ్సి ఆసుపత్రులలో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికులకు 18600రూ మంజూరు చేయాలని, కాకినాడ జిజిహెచ్ శానిటేషన్ కార్మికులకు 14760 ఇస్తున్నారని, కానీ సెక్యూరిటీ గార్డ్స్ కు కేవలం 12100 రూ.
మాత్రమే మంజూరు చేస్తున్నారని, చాలీచాలని జీతాలతో అర్ధాకులతో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ కు సంక్రాంతి లోపు జీవో ప్రకారంగా జీతాలు మంజూరు చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన అన్నారు.
మంచి ప్రభుత్వం వచ్చిందని నమ్మం, మహిళలను వేధింపులు గురి చేస్తే వ్యక్తులను ప్రజా ప్రతినిధులు ప్రోత్సహించకండి, రాజకీయ అండదండలతో కాకినాడ జిజిహెచ్ లో ఎమ్మెల్యే తాలూకా అంటూ కొంతమంది వ్యక్తులు ప్రచారం చేస్తున్నారని, సెక్యూరిటీ గార్డ్స్ ను బెదిరింపులకు గురి చేస్తున్నారని, మహిళల పట్ల సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తించిన వ్యక్తులకు కొమ్ముకాస్తున్నారని, వారికి క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన అన్నారు.
మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసే వ్యక్తుల పై క్రమశిక్షణ చర్యలు చేపట్టకుండా శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ కాంట్రాక్టర్ వారు యధావిధిగా విధుల్లోకి చేర్చుకుంటే యూనియన్ ఆధ్వర్యంలో పనులు నిలుపుదల చేస్తామని, మహిళల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ అనిల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ జాన్ బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి నాయుడు అప్పారావు, కోశాధికారి మధు, రమణమ్మ, లోవ కాటూరి రాజు, వెంకటేష్, మీ రాబి, శ్రీవల్లి, భాగ్యరేఖ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


