డిండి గుండ్ల పల్లి) మే 18 . త్రినేత్రం న్యూస్ : రోజురోజుకు పెరుగుతున్న మద్యం ధరలతో పల్లెల్లో గిరిజన తండాల్లో గుడుంబా గుప్పు మంటుంది. కొన్ని రోజులుగా కఠిన నిబంధనలతో దగ్గు ముఖం పట్టిన తాజాగా బెల్లం ఎక్కువైపోయింది. అడ్డగోలుగా తయారు చేస్తే గ్రామాలతో పాటు పట్టణాలకు సైతం రవాణా చేస్తున్నారు. మండల కేంద్రంతో పాటు మారుమూల ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం అవుతుందని ప్రజలు వాపోతున్నారు.
సారా తయారీకి ఉపయోగించే బెల్లం పట్టుక నవ సాగరం మార్కెట్లో విరివిగా లభిస్తున్నా, వాటిని నివారణ కు ఎక్సైజ్ శాఖ వారు చర్యలు తీసుకోకపోవడంతో తయారయ్య అధికమైందని మండల ప్రజలు వాపోతున్నారు. లభ్యత పెరుగుటడంతో పాటు నిత్యం గ్రామాల్లో గొడవలు చోటు చేసుకుంటున్నాయి యువత సారాయిస్ కి బానిసలుగా మారి నిండు ప్రాణాలను బలి కొంటున్నారు.
డిండి మండల కేంద్రంలో ఒక కిరాణా వ్యాపారి విరివిగా కోరాబం పట్టిక అనుకున్న ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లుగా మామూలు దండుకుంటూ ఏమి ఎరుగనట్లుగా వ్యవహారిస్తున్నారని మండల ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సదరు వ్యాపారి వినియోగదారులకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు బెల్లం కావాలంటే వంట సరుకులు తీసుకున్నట్లయితేనే ఇస్తానని లేకుంటే బెల్లం పట్టికను ఇవ్వనని శరత్ పెడుతున్నాడని వినియోగదారులు (సారా తయారీదారులు) బెంబేలెత్తుతున్నారు.
ఇప్పటికైనా సదరు వ్యాపారి పై చర్యలు తీసుకొని బెల్లం పట్టికను అమ్మకుండా చూడాలని మండల ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎక్సైజ్ అధికారులను కోరుతున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


