Corporator Venkatesh Goud : ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 18 : రీచ్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 కమిటీ హల్ లో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి ముఖ్యఅతిధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై వైద్య శిబిరాన్ని సందర్శించి, వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బి.పి, షుగర్ వంటి అన్ని జనరల్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్న రీచ్ హాస్పిటల్ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

అలాగే ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య నిపుణులు అందిస్తున్న సలహాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, డా౹౹ రామకృష్ణ రెడ్డి, డా౹౹ సృజన రెడ్డి, డా౹౹ అమిత్, బి.వెంకటేష్ గౌడ్, పోశెట్టిగౌడ్, సురభి రమేష్ రావు, విష్ణు వర్ధన్ రెడ్డి, గోవర్ధన్, శ్రీశైలం, రఘు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Corporator Venkatesh Goud visited

You cannot copy content of this page

Scroll to Top