జూలై 23, 2026
TRINETHRAM NEWS
School starts tomorrow

School starts tomorrow : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తం గా శుక్రవారం (మే14) నుంచి జూన్ 19 వరకూ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ఏ రోజున ఎవరేం చేయాలనే మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఈ నెల 14న స్వయం సహాయక బృందాలతో పేరెం ట్స్, టీచర్స్ సమావేశం (పిటిఎం) నిర్వహించాలని, ఈ నెల 21న అంగన్వాడీ టీచర్లు, మ దర్స్ కమిటీలతో, ఈ నెల 28న యువత, నా యకులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో స మన్వయం చేసుకుని అంగన్‌వాడీ కేంద్రాలలో ఐదేళ్లు పైబడిన పిల్లలను గుర్తించి

సమీప ప్రభు త్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేర్పించ డం, బడి ఈడు పిల్లలు, బాలలు, బాలకార్మికు లు, బడి బయటి పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పిస్తారు. బడిబాటలో తల్లిదండ్రులు, స్వ చ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి పిల్లలను పాఠశాలల్లో చేర్పించనున్నారు. ప్రాథమిక పా ఠశాలల ఉపాధ్యాయులు అంగన్‌వాడీ టీచర్ల తో మాట్లాడి, పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతు లు కల్పించడంతో పాటు ఇంగ్లీష్ మీడియం బో ధన అందిస్తుండడంతో ప్రవేశాలు పెంచేలా పా ఠశాల విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page