హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం
మాజీ మంత్రి వర్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 15. తూర్పుగోదావరి జిల్లా, కడియం గ్రామంలో రచ్చబండకల్తీ మద్యం పై కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం కడియం గ్రామంలో, నోటికొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను వంచనకు గురిచేసిన కూటమి ప్రభుత్వ పాలకులను తూర్పుర పట్టాలని, ప్రజలకు జరిగిన మోసాన్ని వైసీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి వివరించాలని మాజీమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పిలుపు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు గారి ఆధ్వర్యంలో కడియం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వ కల్తీ మద్యంపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మండల అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ అధ్యక్షుతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, జహరయ్యారు.
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను ఇంకా మభ్యపెడుతూనే, పాలన సాగిస్తోందని, ముఖ్యఅతిథిగా హాజరైన చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అంతా పాలకుల దుర్నీతిని, అక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేయాలి అన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం దందాను నిర్వహిస్తూ సమావేశంలో నాయకులు,కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


