అల్లూరిజిల్లా (అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, మే 3: రెండో రోజు బంద్‌కు సంబంధించి సర్పంచ్ పెట్టెలి దాసుబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అరకులోయలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జీవో నెం.3 వ్యతిరేకంగా శుక్రవారం జరిగిన బంద్‌కు ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు కలిసి చేపట్టిన కార్యాచరణను తాను సమర్థిస్తున్నానని చెప్పారు. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి చేరవేయడంలో బంద్‌లు ఒక్కోసారి అవసరమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో రోజు బంద్ నిర్వహించడం రాజకీయ లబ్ధికోసమేనని మండిపడ్డారు. “ఈ ప్రాంతంలో నిరుద్యోగులు, సాధారణ ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ ఇలా చేస్తున్నది బాధాకరం,” అని వ్యాఖ్యానించారు.
జీవో 3ని సుప్రీంకోర్టు రద్దు చేసినప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించిన దాసుబాబు, ఆ సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేని వైసీపీ శ్రేణులు ఇప్పుడు బంద్‌లు పెట్టి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీపై బురద జల్లేందుకు బంద్‌ను వినియోగిస్తున్న వైసీపీ నాయకులు ప్రజలకు నిజాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. “గత ఐదేళ్లలో చేసేవి చేయలేని వారు ఇప్పుడు బంద్‌లు చేస్తే ఏమి సాధించగలుగుతారు?” అని ప్రశ్నించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


