అల్లూరిజిల్లా అనంతగిరి అక్టోబర్ 11, (త్రినేత్రం న్యూస్): అనంతగిరి మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమైంది. చెత్త నిర్వహణలో రేయింబవళ్ళు శ్రమిస్తూ, పరిశుభ్రతకు కృషి చేసే ఈ కార్మికులు సమాజానికి నిజమైన సేవకులు. ప్రభుత్వం పారిశుధ్య రంగంలో అనేక సంస్కరణలు చేపట్టినప్పటికీ, అవి గ్రామ స్థాయిలో సమర్థంగా అమలు అయితే పరిశుభ్రతా పనులు మరింత వేగవంతం అవుతాయి.
గిరిజన ప్రాంతాల్లో పర్యాటకరంగం విస్తరిస్తుండటంతో చెత్త పరిమాణం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పారిశుధ్య కార్మికులను సామాజిక సేవకులుగా గుర్తించి వారికి తగిన గౌరవం, ప్రోత్సాహకాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ప్రజలు కూడా పరిశుభ్రతలో భాగస్వాములై, చెత్తను సక్రమంగా పారవేయడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలని చిట్టం మురళి తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


